'కృష్ణ వ్రింద విహారి' నుంచి ట్రైలర్ రిలీజ్!
- నాగశౌర్య నుంచి మరో ప్రేమకథ
- కథానాయికగా షిర్లే పరిచయం
- ఆకట్టుకుంటున్న ట్రైలర్
- ఈ నెల 23వ తేదీన సినిమా రిలీజ్
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో తల్లిముందు అమాయకంగా కనిపించిన హీరో, ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. తన ఆఫీసులోని అమ్మాయితో ప్రేమలో పడతాడు.
హీరో పెరిగిన వాతావరణానికీ .. హీరోయిన్ పెరిగిన వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని రేకెత్తించారు. వెన్నెల కిశోర్ .. సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.