దూసుకుపోతున్న సిద్ శ్రీరామ్ సాంగ్!
- విభిన్నమైన కథాచిత్రంగా 'కృష్ణమ్మ'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- సంగీత దర్శకుడిగా కాలభైరవ
- దర్శకుడిగా గోపాలకృష్ణ పరిచయం
'ఏమవుతుందో మనలో .. మన మనసులలో, ఏం జరిగిందో కలలో తలమునకలలో' అంటూ ఈ పాట సాగుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటను అలా యూ ట్యూబ్ లో వదిలారో లేదో వ్యూస్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
ఇప్పటికే ఈ సాంగ్ 1.2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. కాలభైరవ ట్యూన్ .. తేలికైన పదాలతో అనంత శ్రీరామ్ అల్లిక .. సిద్ శ్రీరామ్ వాయిస్ లోని ప్రత్యేకత ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. రెండు ప్రేమ జంటలపై చిత్రీకరించిన ఈ పాట యూత్ తో మాస్ ను కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను కొరటాల శివ సమర్పిస్తూ ఉండటం విశేషం.