‘ఖుదీరామ్ బోస్’ మోషన్ పోస్టర్ వచ్చేసింది.. వీడియో ఇదిగో
- ఇటీవలే సినిమా టైటిల్‌ను విడుదల చేసిన వెంకయ్యనాయుడు
- దేశ స్వాతంత్ర్యం కోసం పిన్నవయసులోనే ప్రాణాలర్పించిన ఖుదీరామ్ బోస్
- తెలుగుతోపాటు మరో ఐదు భాషల్లో విడుదల
పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. భారత స్వాతంత్ర్యం కోసం అత్యంత పిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన వీరుడిగా ఖుదీరామ్ చరిత్రకెక్కాడు. 1889లో జన్మించిన ఖుదీరామ్.. ముజఫర్‌పూర్ కుట్ర కేసులో దోషిగా తేల్చిన బ్రిటిషర్లు.. 1908లో ఆయనకు మరణశిక్ష విధించారు. ఈ కేసు విచారణలో జరిగిన కుట్ర, తదనంతర పరిణామాల నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు యూనిట్ తెలిపింది.