కేటీఆర్ చాలెంజ్ ను స్వీకరించి... చంద్రబాబు, బాలినేనిలను నామినేట్ చేసిన పవన్ కల్యాణ్
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
- చేనేత దుస్తులు ధరించిన ఫొటోలు పోస్టు చేయాలన్న కేటీఆర్
- ఓకే చెప్పిన పవన్ కల్యాణ్
- నేతన్నలపై తనకు ప్రేమాభిమానాలున్నాయని వెల్లడి
దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. రామ్ భాయ్ విసిరిన చాలెంజ్ ను స్వీకరిస్తున్నానని వెల్లడించారు. ఈ చాలెంజ్ ను స్వీకరించడానికి చేనేత కార్మికుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలే కారణమని పవన్ తెలిపారు. ఇప్పుడు తాను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ లను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. చేనేత దుస్తులు ధరించిన ఫొటోలు పోస్టు చేసి జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్నలపై ప్రేమాభిమానాలను చాటుకోవాలని పేర్కొన్నారు.