బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల
- సొహైల్, మోక్ష జంటగా 'లక్కీ లక్షణ్' సినిమా
- 'అదృష్టం చలో అందిరో చందమామ' టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
- సాంగ్ ను లాంచ్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ
ఈ సందర్భంగా సొహైల్ మాట్లాడుతూ, తమ సినిమా టైటిల్ సాంగ్ వీడియోను శివ నిర్వాణ లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఏఆర్ అభి, హరిత గోగినేనిలకు సినిమాలపై ఎంత ప్యాషన్ ఉందో... కథలను ఎంచుకోవడంలో కూడా వారికి అంతే అభిరుచి ఉందని కొనియాడాడు. క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదని... సీనియర్ టెక్నీషియన్స్ తో సినిమాను నిర్మించారని చెప్పాడు.
ఈ చిత్రంలో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి, జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ తదితరులు నటించారు.