మహేశ్ చేతుల మీదుగా 'పొన్నియన్ సెల్వన్' టీజర్ రిలీజ్!
- మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియన్ సెల్వన్'
- చారిత్రక నేపథ్యంలో సాగే కథాకథనాలు
- భారీ తారాగణంతో రూపొందిన సినిమా
- సెప్టెంబర్ 30వ తేదీన వివిధ భాషల్లో విడుదల
తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ భాషలన్నింటిలోను టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగు టీజర్ ను మహేశ్ బాబు చేతులమీదుగా విడుదల చేయించారు.
ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ లో, పోరాట సన్నివేశాలను హైలైట్ చేశారు. అలాగే కథలోని కొన్ని సున్నితమైన అంశాలను డైలాగ్స్ లేకుండా టచ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ సినిమా మరో సంచలనానికి తెర తీస్తుందేమో చూడాలి.