84 ఏళ్ల వయసులో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ నటీమణి
- దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న వహీదా
- తెలుగు సినిమాలలోనూ నటించిన వైనం
- తాజాగా కొత్త కారును సొంతం చేసుకున్న నటి
- కారును డెలివరీ ఇచ్చిన బీఎండబ్ల్యూ
ఆమె తాజాగా బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఫేస్ లిఫ్ట్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ సెలూన్ కారును బీఎండబ్ల్యూ ప్రతినిధులు వహీదా రెహమాన్ కు అందించారు. కాగా, అటు విలాసం, ఇటు పనితనం.... ఏ విధంగా చూసినా బీఎండబ్ల్యూ కార్ల ప్రత్యేకత కనిపిస్తుంది. వహీదా కొనుగోలు చేసిన 5 సిరీస్ కారు ఎక్స్ షోరూం ధర రూ.64.50 లక్షల నుంచి రూ.74.50 లక్షల వరకు ఉంటుంది. వహీదా ఇప్పటివరకు హోండా అక్కార్డ్ కారు వినియోగించారు.