'కృష్ణ వ్రింద విహారి' లిరికల్ సాంగ్ విడుదల
- వరుస ఫ్లాపులతో ఉన్న నాగశౌర్య
- ఈ నెల 20వ తేదీన రానున్న సినిమా
- కథానాయికగా షిర్లే సెటియా
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
ఈ నేపథ్యంలో తాజాగా మరో సాంగును వదిలారు. 'ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు .. మారిందిరా అందం చరిత్ర నేడు' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. ఫారిన్ లో పుట్టిపెరిగిన హీరోయిన్ ను వెంటబెట్టుకుని తన విలేజ్ కి తీసుకుని వస్తాడు. ఇక్కడి వాళ్లంతా ఆమెకి ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతారు. ఆ సంతోషంలో హీరో పాడుకునే పాట ఇది.
హర్ష సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిచరణ్ ఆలపించాడు. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీని అందించాడు. సాహిత్యం .. ట్యూన్ .. అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.