మహేశ్ బాబుకు క్షమాపణ చెప్పిన కీర్తి సురేశ్.. మూడు సార్లు కొట్టానని వెల్లడి
- సర్కారు వారి పాట షూటింగ్ లో సరదా ఘటన
- గుండె వేగం రెట్టింపైందని చెప్పిన హీరోయిన్
- మహేశ్ బాబు కూడా సరదా వ్యాఖ్యలు చేశారని వెల్లడి
మహేశ్ బాబుతో షూటింగ్ చేయడం సరదా సరదాగా ఉంటుందని చెప్పింది. ఓ పాట షూటింగ్ సందర్భంగా తాను టైమింగ్ ను కోల్పోయానని, స్టెప్పులు మరిచిపోయానని చెప్పింది. అదే సమయంలో మహేశ్ మొహంపై రెండు సార్లు మిస్ టైమింగ్ తో కొట్టానని చెప్పింది. అప్పటికే సారీ చెప్పానని, మూడో సారీ అది రిపీట్ అయిందని ఆమె పేర్కొంది. ఆ టైంలో తన గుండె వేగం రెట్టింపైందని చెప్పింది. ‘నా మీద ఏమైనా పగ ఉందా?’ అంటూ మహేశ్ తనను సరదాగా అడిగారని చెప్పింది.