జయసుధను ప్రశంసిస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్
- దైవపుత్రుడు అనే క్రైస్తవ గీతాన్ని పాడిన జయసుధ
- మీ పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులు అవుతారన్న వర్మ
- యూట్యూబ్ ఛానల్ లింక్ ను షేర్ చేసిన ఆర్జీవీ
ఆ తర్వాత జయసుధ, మోహన్ బాబులను పెట్టి 2014లో ఆయన 'రౌడీ' సినిమాను తీశారు. జయసుధతో 'మనీ', 'మనీ మనీ' సినిమాను కూడా నిర్మించారు. తాజాగా జయసుధను వర్మ ఆకాశానికెత్తేశారు. 'దైవపుత్రుడు' అనే క్రైస్తవ గీతాన్ని ఆమె పాడారు. ఈ గీతాన్ని ట్విట్టర్ లో వర్మ షేర్ చేశారు. 'జయసుధగారూ, మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులుగా మారిపోతారు' అని ట్వీట్ చేశారు. అంతేకాదు జయసుధ పాటకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ ను కూడా షేర్ చేశారు.