'ఎన్టీఆర్ కుటుంబంతో బంధుత్వం' అంటూ జరుగుతున్న ప్రచారంపై నాగశౌర్య తల్లి వివరణ
- ఎలాంటి బంధుత్వం లేదన్న ఉషా మూల్పూరి
- లక్ష్మీప్రణతి కజిన్ కు నాగశౌర్య ఫ్రెండ్ అని వెల్లడి
- ఎన్టీఆర్ అంటే నాగశౌర్యకు అభిమానమని వివరణ
ఎన్టీఆర్ అర్ధాంగి లక్ష్మీ ప్రణతి కజిన్, నాగశౌర్య మంచి స్నేహితులు అని ఆమె వెల్లడించారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ తో బంధుత్వం అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ అంటే నాగశౌర్యకు ఎంతో ఇష్టమని, వారి కుటుంబానికి నాగశౌర్య ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ లా మెలుగుతాడని పేర్కొన్నారు.
నాగశౌర్య ప్రస్తుతం అనీష్ కృష్ణ దర్శకత్వంలో 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నాగశౌర్య తల్లి ఉష నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.