రజనీ సినిమాలు చాలా టెన్షన్ పెట్టేవి: ఏఆర్ రెహ్మాన్
- రజనీ సినిమాలపై అంచనాలు ఎక్కువ
- మ్యూజిక్ పరంగా వాటిని అందుకోవడం కష్టం
- నాకు సమయం తక్కువగా ఉండేది
- దీపావళి అంటే టెన్షన్ పెరిగిపోయేదన్న రెహ్మాన్
ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రెహ్మాన్ స్పందించారు. రజనీకాంత్ గారి సినిమాలకు వరుసగా పనిచేశాను. సహజంగానే ఆయన సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. మ్యూజిక్ పరంగా ఆ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేది. ఇక ఎప్పుడూ కూడా ఇతర ప్రాజెక్టులతో నేను బిజీగా ఉన్నప్పుడు రజనీ సార్ సినిమాలు నాకు వచ్చేవి.
సాధారణంగా రజనీ సినిమాలు దీపావళికి ఎక్కువగా విడుదలయ్యేవి. ఆ సమయానికి నేను నా వర్క్ పూర్తి చేయవలసి ఉండేది. నాకు చాలా తక్కువ సమయం ఇచ్చేవారు. దాంతో నేను చాలా టెన్షన్ పడేవాడిని. దీపావళి వస్తుందంటేనే టెన్షన్ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.