'గని' నుంచి నదియా పాత్ర పరిచయం!
- వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని'
- బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
- కీలకమైన పాత్రలో సునీల్ శెట్టి
- డిసెంబర్ 3వ తేదీన విడుదల
ఈ సినిమాలో నటీనటుల పేర్లను రీసెంట్ గా రివీల్ చేశారు. ఈ సినిమాలో 'మాధురి' అనే కీలకమైన పాత్రను నదియా పోషించింది. ఆ పాత్రను పరిచయం చేస్తూ ఆమె లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆమె పాత్ర హైలైట్ గా నిలవనున్నట్టు చెబుతున్నారు. ఇంతవరకూ ఆమె చేస్తూ వచ్చిన పాత్రలకి ఈ పాత్ర భిన్నంగా ఉంటుందని అంటున్నారు.
ఈ నెల 15వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నరేశ్ .. తనికెళ్ల భరణి .. నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.