ఆనంద్ దేవరకొండ ఇక రూట్ మార్చాలేమో!
- 'దొరసాని'తో పరిచయం
- 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో గుర్తింపు
- వరుసగా ఇన్నోసెంట్ పాత్రలు
- ఈ నెల 12న రానున్న 'పుష్పక విమానం'
'గడీ' నేపథ్యంలో సాగే ప్రేమకథ కావడం వలన .. పాటలు బాగా కుదరడం వలన, ఆ సినిమా ఆయనకి మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తరువాత ఆయన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా చేశాడు. తన కాళ్లపై తాను నిలబడాలి .. తన ప్రత్యేకతను చాటుకోవాలని తపించే ఒక మధ్యతరగతి యువకుడి పాత్ర అది. ఈ సినిమాలో కూడా ఆయన పాత్రలో తెగింపు అనేది కనిపించదు. ఇక ఇప్పుడు ఆయన 'పుష్పక విమానం' సినిమాతో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమాలో ఆయన ఇన్నోసెంట్ టీచర్ పాత్రలో కనిపించనున్నాడు. తన పెళ్లామ్ తనని వదిలేసి వెళ్లిపోయింది అనేది ఒక బేస్ లైన్ లా పట్టుకుని మరీ వస్తున్నాడు. అయితే కథ ఏదైనా .. కథనం ఎలా ఉన్నా ఆయన ఇన్నోసెంట్ పాత్రలనే వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇదే కంటిన్యూ అయితే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందువలన ఇకనైనా ఆయన తన రూట్ మార్చుకోవలసిన అవసరం కనిపిస్తోంది.