ఉండవల్లి వ్యాఖ్యల వీడియో పార్ట్-2 పంచుకున్న పవన్ కల్యాణ్
- ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఉండవల్లి విశ్లేషణ
- ఈ ఉదయం ఒక వీడియో పంచుకున్న పవన్
- దానికి కొనసాగింపుగా తాజా వీడియో
- గణాంకాలను వెల్లడించిన ఉండవల్లి
కార్పొరేషన్లను తనఖా పెట్టడం ద్వారా తెచ్చిన అప్పు రూ.1,21,203 కోట్లు అని ఉండవల్లి పేర్కొన్నారు. ఇందులో రూ.71,761 కోట్లను ఈ రెండేళ్లలోనే తెచ్చారని తెలిపారు. అంతేకాదు, కేంద్రం వద్దకు వెళ్లి ఏంచేశారో తెలియదు కానీ, మిగతా రాష్ట్రాల కంటే ఓ రూ.20 వేల కోట్ల అప్పు అదనంగా తీసుకువచ్చారని వివరించారు.
సాధారణ పరిస్థితుల్లో ఎఫ్ఆర్ బీఎం పరిమితి 3 శాతం ఉంటుందని, కరోనా సంక్షోభం వల్ల ఆ పరిమితిని 5 శాతం పెంచారని ఉండవల్లి వెల్లడించారు. ఎఫ్ఆర్ బీఎం మీద తెచ్చిన అప్పు రూ.3,50,000 కోట్లు అని తెలిపారు. జగన్ పరిపాలన చేపట్టే నాటికి రాష్ట్రానికి ఇంకో రూ.90 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. ఈ విధంగా రాష్ట్రంపై రూ. 6 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని విశదీకరించారు.