ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను: హీరో సిద్ధార్థ్
- షూటింగులో గాయపడిన సిద్ధార్థ్
- లండన్ లోని ఆసుపత్రిలో సర్జరీ
- ఇండియాకు తిరిగొచ్చానని వెల్లడించిన సిద్ధార్థ్
ప్రస్తుతం హైదరాబాదులో 'మహా సముద్రం' సినిమాకు డబ్బింగ్ చెపుతున్నానని తెలిపారు. సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నానని అన్నారు. డాక్టర్లు కొంతకాలం రెస్ట్ తీసుకోమని సూచించారని తెలిపారు. అక్టోబర్ 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఏకే ఎంటర్టైన్ మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.