రేపు వెంకీ చేతుల మీదుగా 'నాట్యం' సాంగ్ రిలీజ్!
- నాట్యమే ప్రధాన ఇతివృత్తంగా సాగే కథ
- దర్శకుడిగా రేవంత్ కోరుకొండ
- కీలకమైన పాత్రలో భానుప్రియ
- అక్టోబర్ 22వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. వెంకటేశ్ చేతుల మీదుగా రేవు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి 'పోనీ పోనీ' అనే ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. శ్రావణ్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా నిలవనుంది.
సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో శుభలేఖ సుధాకర్ .. కమల్ కామరాజు .. రుక్మిణి విజయ్ కుమార్ కనిపించనున్నారు. అక్టోబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి.
.