'పాగల్' రిలీజ్ డేట్ ఖరారు!
- విష్వక్ సేన్ నుంచి 'పాగల్'
- కథానాయికగా సిమ్రన్ పరిచయం
- సంగీత దర్శకుడిగా రధన్
- ఈ నెల 14వ తేదీన విడుదల
ఇటు యూత్ ను .. అటు మాస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో విష్వక్ సేన్ జోడీగా నివేదా పేతురాజ్ .. సిమ్రన్ చౌదరి కనువిందు చేయనున్నారు. రధన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
మురళీశర్మ.. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'హిట్' సినిమా తరువాత విష్వక్ సేన్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా విడుదలవుతుందనే బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.