ముగింపు దశలో 'బింబిసార'
- కల్యాణ్ రామ్ చారిత్రక చిత్రం
- 90 శాతం షూటింగు పూర్తి
- ఒక భాగంగా మాత్రమే రానున్న మూవీ
వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. యుద్ధం నేపథ్యంలో రూపొందే సినిమా కావడం వలన భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల కల్యాణ్ రామ్ పూర్తి సంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా రెండు .. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం నిన్నటివరకు జరిగింది. కానీ ఈ సినిమా ఒక భాగంగానే రానుందని ఇప్పుడు వినిపిస్తోంది. ఇంతవరకూ సాంఘికాలు చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.