మళ్లీ థియేటర్లలో దిగనున్న 'వకీల్ సాబ్'?
- హిట్ టాక్ తెచ్చుకున్న 'వకీల్ సాబ్'
- అమెజాన్ ప్రైమ్ లోను పలకరించిన మూవీ
- మళ్లీ రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు
అయితే థియేటర్స్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతూ ఉండగా, కరోనా తీవ్రత పెరిగింది. దాంతో థియేటర్స్ దగ్గర జనం పలచబడటం .. ఆ తరువాత థియేటర్లు మూతబడటం జరిగిపోయింది. ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 300 థియేటర్లలో 'వకీల్ సాబ్'ను మళ్లీ రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడని అంటున్నారు.