తేజ దర్శకత్వంలో రానా బ్రదర్ అభిరామ్!
- కొత్త హీరోలను పరిచయం చేసిన తేజ
- ఆయన దర్శకత్వంలో రానాకు మంచి హిట్
- అభిరామ్ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ
సురేశ్ ప్రొడక్షన్స్ వారితో తేజకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రానాతో ఆయన చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' భారీ విజయాన్ని సాధించింది. అందువల్లనే సురేశ్ బాబు .. తేజ చేతిలో అభిరామ్ ను పెట్టాడని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారానే తాను సంగీత దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెప్పారు. అందువలన ఈ ప్రాజెక్టు ఖాయమైపోయిందని తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ .. నితిన్ .. నవదీప్ ను హీరోలుగా తెరకి పరిచయం చేసిన తేజ, అభిరామ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.