మెగా బ్రదర్స్ సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్న బిగ్ బాస్ భామ
- బిగ్ బాస్-4లో అందరినీ అలరించిన దివి
- పోలీస్ ఆఫీసర్ పాత్రను ఆఫర్ చేసిన చిరంజీవి
- పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రంలోనూ అమ్మడికి మంచి పాత్ర!
- వరుస చాన్సులతో ఎగిరి గంతేస్తున్న దివి
బిగ్ బాస్-4కి ముందు దివి ఎవరో చాలామందికి తెలియదు. కానీ, ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందంటే అతిశయోక్తి కాదు. అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు గుంపులో గోవింద వంటి వేషాలతో సరిపెట్టుకున్న దివి ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తుండడంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోంది.