ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ అరెస్ట్.. లాహోర్‌లో బేడీలు!
- 2008లో లఖ్వీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస
- 2015 నుంచి బెయిలుపై ఉన్న లష్కరే కమాండర్
- లాహోర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఐక్యరాజ్య సమితి లఖ్వీని 2008లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ముంబై పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన అతడు 2015 నుంచి బెయిలుపై ఉన్నాడు. తాజాగా, అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. ఉగ్రవాదుల కోసం సేకరించిన నిధులతో ఓ చికిత్సా కేంద్రాన్ని నిర్వహిస్తున్న లఖ్వీ, దాని ద్వారా సమీకరించిన నిధులను తిరిగి ఉగ్రవాదులకు చేరవేసేవాడని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడీ) తెలిపింది.