సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ఆదిపురుష్' నాయికగా మరో పేరు!
- ఫిబ్రవరికి వాయిదా వేసిన రజనీకాంత్
- నాగశౌర్య సినిమా 'వరుడు కావలెను'
* తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదాపడింది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులలో షూటింగ్ చేయడం రిస్క్ అన్న భావనలో వున్న రజనీ షూటింగును వాయిదా వేయమన్నట్టు తెలుస్తోంది.
* నాగశౌర్య హీరోగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి 'వరుడు కావలెను' అనే వెరైటీ టైటిల్ని నిర్ణయించారు. ఇందులో రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది.