దీపిక తెలిపిన వివరాలపై ఎన్సీబీ అధికారుల అసంతృప్తి!
- దీపిక పదుకొనేను విచారించిన ఎన్సీబీ అధికారులు
- కరిష్మా ప్రకాశ్ తో సాధారణ సంబంధాలున్నాయన్న దీపిక
- డ్రగ్స్ సంబంధాలు లేవని స్పష్టీకరణ
- దీపిక వాదనలపై ఎన్సీబీ అధికారుల అనుమానం!
అయితే ఎన్సీబీ అధికారులు ఆమె వాదనలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరిష్మా ప్రకాశ్ చెప్పిన వివరాల ప్రకారం తమ డ్రగ్స్ గ్రూపులో దీపికనే కీలకమని, ఆమే గ్రూప్ అడ్మిన్ అని తెలిపినట్టు సమాచారం.
మరోవైపు, దీపికతో పాటు తాను కూడా విచారణకు వస్తానని ఆమె భర్త రణవీర్ సింగ్ తమను అభ్యర్థించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఎన్సీబీ స్పష్టం చేసింది. దీపిక విచారణలో ఒత్తిడికి గురయ్యే అవకాశముందని, అందుకే తాను కూడా ఆమె పక్కనే ఉండాలనుకున్నట్టు రణవీర్ తమను కోరాడనడంలో నిజంలేదని ఎన్సీబీ అధికారులు తెలిపారు.