Junior NTR: 'ఆర్ఆర్ఆర్'ను ఆ రోజున విడుదల చేయలేము: నిర్మాత డీవీవీ దానయ్య

  • ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • సంక్రాంతి కానుక లేనట్టే
  •  ఏప్రిల్ 28న రిలీజ్ చేసే ఛాన్స్  
RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో .. డీవీవీ దానయ్య నిర్మాణంలో 'ఆర్ ఆర్ ఆర్'  రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగు, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాతనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8 వ తేదీన విడుదల చేయనున్నట్టు కొంతకాలం క్రితమే ప్రకటించారు.

అయితే ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయలేమని ఓ  ఇంటర్వ్యూలో నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. 'జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే అనుకున్నాము, అయితే లాక్ డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి.  అందువలన ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేము' అని చెప్పుకొచ్చారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి 2 సినిమా థియేటర్స్ కి వచ్చినరోజు అదేననే విషయం అందరికీ తెలిసిందే.

More Telugu News