నిఖిల్ గౌడ పెళ్లిపై యడియూరప్ప సర్కారు సీరియస్... రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం!
- ఓ ఫామ్ హౌస్ లో నిఖిల్ గౌడ వివాహం
- లాక్ డౌన్ సమయంలో పెళ్లిపై అభ్యంతరాలు
- విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం
ఈ విషయమై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ్, ఈ పెళ్లిపై చర్యలు తీసుకోకుంటే, వ్యవస్థను వెక్కిరించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీతోనూ మాట్లాడామని, వివాహం జరిపించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా, బెంగళూరులోని రామ్ నగర్ పరిధిలోని కేతగానహళ్లిలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో నిఖిల్ గౌడకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కృష్ణప్ప మనవరాలు రేవతికి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.