'నిశ్శబ్దం'లో వైవిధ్యం చూపించే షాలినీ పాండే!
- అనుష్క చుట్టూ అల్లుకున్న కథ
- సోనాలి పాత్రలో షాలినీ పాండే
- అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
ఈ సినిమాలో అనుష్క స్నేహితురాలు 'సోనాలి' పాత్రలో షాలినీ పాండే కనిపించనుంది. ఆమె పాత్ర అనుమానాస్పదంగా ఉంటుందనీ, ఆమె పాత్రనే కథలో కీలకంగా నిలుస్తుందని తెలుస్తోంది. షాలినీ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని అంటున్నారు. షాలినీ పాండేకి వైవిధ్యభరితమైన రోల్ పడిందనీ, నటన పరంగా ఇది తనని తాను నిరూపించుకునే పాత్ర అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.