ప్రభాస్ తో అనుబంధంపై మరింత క్లారిటీ ఇచ్చిన అనుష్క
- తమది హిట్ పెయిర్ అని వెల్లడి
- ప్రభాస్ పదేళ్లుగా తెలుసన్న అనుష్క
- ప్రేమ ఉందంటూ వదంతులు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు
అయితే, ప్రభాస్ కు తాను వేకువజామున మూడింటికైనా ఫోన్ చేయగలిగేంత చనువుందని వెల్లడించారు. వెండితెరపై తమ జోడీ సూపర్ హిట్ కావడంతో సహజంగానే ఊహాగానాలు వస్తుంటాయని, ప్రేమ అంటూ ఏవేవో ప్రచారం చేశారని పేర్కొన్నారు. ప్రభాస్ తనకు దశాబ్దకాలంగా తెలుసని, ప్రభాస్ వ్యక్తిత్వం కూడా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, ఎలాంటి ఫీలింగ్ కలిగినా ఇతరులతో పంచుకుంటామని అనుష్క వివరించారు. కాగా, టాలీవుడ్ హిట్ పెయిర్లలో ప్రభాస్, అనుష్క ముందువరుసలో ఉంటారు. బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ వరకు సక్సెస్ ఫుల్ జోడీగా పేరుతెచ్చుకున్నారు.