నాగశౌర్య సినిమా ఆగిపోలేదట
- నాగశౌర్యకి రెండు హిట్లు ఇచ్చిన అవసరాల
- మూడో సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి
- తదుపరి షెడ్యూల్ విదేశాల్లో
కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై వివేక్ కూచిభొట్ల స్పందించాడు. తమ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ జరిగిందని అన్నాడు. ఈ సినిమాలో కొంత భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించవలసి ఉందనీ, వీసాల సమస్య కారణంగా ఆ షెడ్యూల్ ఆలస్యమవుతోందని చెప్పాడు. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ సినిమాను పూర్తి చేస్తామనీ, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశాడు. గతంలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య చేసిన రెండు సినిమాలు విజయవంతమైన సంగతి తెలిసిందే.