బస్ లో తనకు దొరికిన క్యాష్ బ్యాగ్ ను జాగ్రత్తగా యజమానికి చేర్చిన కండక్టర్ ప్రవీణ!
- దిల్ సుఖ్ నగర్ డిపోలో పనిచేస్తున్న ప్రవీణ
- బస్ లో బ్యాగ్ ను మరచిపోయిన ప్రయాణికుడు
- పోలీసుల సాయంతో బ్యాగ్ తిరిగి అందజేత
ఆపై బస్సు గమ్యానికి చేరిన తరువాత ప్రవీణకు ఆ బ్యాగ్ కనిపించింది. తీసి చూడగా, అందులో రూ. 20 వేలకు పైగా నగదుంది. దీంతో ఆమె మలక్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సాయంతో బాధితుడికి బ్యాగ్ ను చేర్చింది. పోయిందనుకున్న డబ్బులు వెతుక్కుంటూ వెనక్కు రావడంతో అతను ప్రవీణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ నిజాయితీని టీఎస్ ఆర్టీసీ అధికారులు, పోలీసులు అభినందించారు.