అమీర్ పేటలో పిచ్చికుక్కల దాడి ఘటనపై హెచ్ఆర్సీలో పిటిషన్
- హెచ్ఆర్సీలో బాలల హక్కుల సంఘం పిటిషన్
- జీహెచ్ఎంసీ, పశువైద్య అధికారులపై మండిపాటు
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు డిమాండ్
అమీర్ పేటలో పిచ్చికుక్కల దాడి ఘటనల్లో సుమారు యాభై మంది వరకు గాయపడ్డారని హెచ్ఆర్సీ దృష్టికి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్ రావు తీసుకెళ్లారు. ఈ ఘటనలో బాధితులకు వైద్య ఖర్చులను ప్రభుత్వం చెల్లించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని ఆ పిటిషన్ లో డిమాండ్ చేశారు.