సక్సెస్ టాక్ వచ్చేసింది .. సంతోషం: హీరో కల్యాణ్ రామ్
- తొలి ఆటకి వచ్చిన టాక్ వేరు
- మధ్యాహ్నానికి టాక్ మారిపోయింది
- ప్రేక్షకులు ఆదరించారన్న కల్యాణ్ రామ్
తాజాగా ఈ సినిమాను గురించి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "మొదటి ఆటకు మా సినిమాపై ఓ మాదిరి టాక్ వచ్చినప్పటికీ, మ్యాట్నీ నుంచి సినిమా బాగా ఉందనే టాక్ వచ్చింది. మేము అనుకున్నట్టుగానే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. ఆడియన్స్ ఆదరణ లభించడం నిజంగా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. అలాగే 'ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ వుందో' పాట అంటే నాకు చాలా ఇష్టం. నా కెరియర్లోనే నాకు బాగా నచ్చిన పాట ఇది. ఇంత మంచి పాటను ఇచ్చిన గోపీసుందర్ కి థ్యాంక్స్" అని చెప్పుకొచ్చాడు.