దూసుకుపోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సాంగ్
- దేవిశ్రీ స్వరకల్పనకు ఫ్యాన్స్ ఫిదా
- కొత్త రికార్డులను సృష్టిస్తున్న సాంగ్
- వచ్చే సోమవారం మరో సాంగ్ రిలీజ్
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట 24 గంటలు గడవకముందే రెండున్నర మిలియన్ల వ్యూస్ కి చేరువైంది. గతంలో మహేశ్ పేరుతో వున్న యూ ట్యూబ్ రికార్డులను ఈ పాట అధిగమించేలానే ఉందని అంటున్నారు. కథాకథనాలపరంగానే కాకుండా, ఇతర విశేషాల పరంగా కూడా ఈ సినిమా అనేక ప్రత్యేకతలను కలిగి ఉండటంతో, అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.