'అల వైకుంఠపురములో' నుంచి టబు ఫస్టులుక్
- విభిన్నమైన కథగా 'అల వైకుంఠపురములో'
- పవర్ఫుల్ పాత్రలో 'టబు'
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను వదిలారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో .. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీమంతురాలైన 'అలకనందాదేవి' పాత్రలో టబు కనిపించనుంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా వుండనున్నట్టు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.