మహేశ్ బాబు చిత్రంలో విజయశాంతి ఫస్ట్ లుక్ అదుర్స్
- శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు'
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న మహేశ్ సినిమా
- 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి
స్టైలిష్ లుక్ తో ఈ పోస్టర్ లో విజయశాంతి ఆకట్టుకుంటున్నారు. కూర్చీలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, ఏదో ఆలోచిస్తున్నట్టు ఆమె ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటిస్తుండటంతో... ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, ఈ చిత్రంలో విజయశాంతి పోషిస్తున్న పాత్ర ఏంటనేది ఇంత వరకు చిత్ర యూనిట్ సీక్రెట్ గానే ఉంచింది. సంక్రాంతి సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కాబోతోంది.