కేసీఆర్ హుజూర్‌నగర్ పర్యటన రద్దుకు కారణం చెప్పిన విజయశాంతి
- కేసీఆర్ అందుకే హెలికాప్టర్‌లో వెళ్లాలనుకున్నారు
- సభలో తనకు చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని ముందే గ్రహించారు
- సభను రద్దు చేసుకుని ఓటమిని అంగీకరించారు
ఆర్టీసీ కార్మికుల నుంచి సభలో తనకు చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని ముందే గ్రహించి ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని విజయశాంతి విమర్శించారు. నిరసనల సెగ భయంతోనే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజూర్‌నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లలేకపోయారని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న కేసీఆర్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారని విజయశాంతి ఎద్దేవా చేశారు.