హుజూర్ నగర్ లో ప్రచారం నిర్వహించనున్న నందమూరి సుహాసిని
- టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్మయి
- ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీడీపీ
- అధిష్ఠానం ఆదేశాలతో ప్రచార బరిలోకి సుహాసిని
రేపటి నుంచి మూడు రోజుల పాటు సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. సుహాసిని ప్రచారం చేయడం వల్ల మహిళల ఓటు బ్యాంకు పెరుగుతుందని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం నిర్వహించబోతున్నారని సమాచారం.