'అల వైకుంఠపురములో' నుంచి 'సామజవరగమన' సాంగ్
- షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ
- బన్నీ జోడీగా పూజా హెగ్డే
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
నాయకుడు .. నాయకి వెంటపడుతూ, ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటగా ఇది అనిపిస్తోంది. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది. సొగసైన అర్థాలు వచ్చే పదునైన పద ప్రయోగాలు చేస్తూ ఆయన పాటను అందించారు. తమన్ బాణీ .. సిద్ శ్రీరామ్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. 'టబు' కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతిని విడుదల చేయనున్నారు.