విడుదలకి ముస్తాబవుతోన్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథా కథనాలు
- కీలకమైన పాత్రల్లో జయసుధ - కోట
- వచ్చేనెల 5వ తేదీన విడుదల
బాలాజీ సనాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బంధాలు - అనుబంధాల గొప్పతనాన్ని చాటుతూ, గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో మరో కథానాయకుడిగా అవసరాల శ్రీనివాస్ నటించాడు. కథానాయికలుగా మేఘా చౌదరి - సోఫియా కనిపించనున్నారు. జయసుధ .. కోట శ్రీనివాసరావు .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషించారు. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాతో నవీన్ విజయకృష్ణకి హిట్ పడుతుందేమో చూడాలి.