'అల వైకుంఠపురం'లో బన్నీ ద్విపాత్రాభినయం?
- త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మూడో సినిమా
- కీలకమైన పాత్రలో 'టబు'
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర సరసన సహ ఉద్యోగినిగా పూజా హెగ్డే కనిపిస్తుందని అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. టబు కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, నివేదా పేతురాజ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో నిర్మితమవుతోన్న ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.