ఆసక్తిని రేపుతోన్న 'రాహు' ఫస్టులుక్
- థ్రిల్లర్ సినిమాగా రూపొందిన 'రాహు'
- విభిన్నమైన పాత్రలతో సాగే కథాకథనాలు
- థ్రిల్ చేయడం ఖాయమంటున్న సుబ్బు
తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను వదిలారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు .. ఫస్టులుక్ పోస్టర్ ఆసక్తిని రేపుతున్నాయి. ఇది ఒక డిఫరెంట్ మూవీ అనే ఆలోచనను కలిగిస్తోంది. కృతి గార్గ్ .. అభిరామ్ వర్మ .. 'కాలకేయ' ప్రభాకర్ .. 'సత్యం' రాజేశ్ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని దర్శకుడు సుబ్బు చెప్పుకొచ్చాడు.