ప్రత్యక్ష పోరాటానికి దిగడానికి కూడా వెనుకాడను: విజయశాంతి హెచ్చరిక
- విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలి
- సుప్రీంకోర్టు తీర్పుతో విద్యాశాఖ మేలుకోవాలి
- ఫీజుల నియంత్రణకు కంటితుడుపు చర్యగా కమిటీ వేశారు
కేజీ నుంచి పీజీ వరకు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ విద్యాసంస్థలు స్వైర విహారం చేశాయని దుయ్యబట్టారు. ఫీజుల నియంత్రణ కోసం వేసిన కమిటీలు స్వేచ్ఛగా పనిచేసేందుకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని... ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు కూడా తాను వెనుకాడనని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.