'ఓ బేబీ' వేడుకకి ముఖ్య అతిథులుగా వెంకటేశ్ - రానా
- నందినీ రెడ్డి నుంచి 'ఓ బేబీ'
- ఈ రోజు సాయంత్రం వేడుక
- వచ్చేనెల 5న సినిమా విడుదల
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ఆరంభించనున్నారు. హైదరాబాద్ లోని 'జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్' ఈ వేడుకకి వేదిక కానుంది. ఈ వేడుకకి వెంకటేశ్ - రానా ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన సమంతకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.