సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- చైతూ సరసన కీర్తి సురేశ్
- కేఏ పాల్ పాత్రలో సునీల్?
- బాలకృష్ణతో 'కల్కి' దర్శకుడు
* ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు, ఇటీవల రాజకీయాలలో తన స్టేట్మెంట్లతో కామెడీ సృష్టించిన కేఏ పాల్ పాత్ర తెరకెక్కనుంది. ఈయన జీవన ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని ఓ చిత్రం రూపొందనున్నట్టు, ఇందులో పాల్ పాత్రను ప్రముఖ హాస్య నటుడు సునీల్ పోషించనున్నట్టు తెలుస్తోంది.
* తాజాగా రాజశేఖర్ తో 'కల్కి' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో బాలకృష్ణతో ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది ప్రయోగాత్మక చిత్రమని, టాలీవుడ్ లో ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదని ప్రశాంత్ వర్మ చెప్పాడు.