ఆసక్తిని రేపుతోన్న 'ఓ బేబీ' ట్రైలర్
- విభిన్నమైన కథాకథనాలు
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న సన్నివేశాలు
- వచ్చేనెల 5వ తేదీన విడుదల
సమంత రూపంలో పడుచు వయసు .. లోపల వృద్ధురాలైన లక్ష్మి మనసు .. ఈ రెండింటి మధ్య జరిగే అల్లరిని అర్థం చేసుకోలేక బయటవాళ్లు పడే ఇబ్బందులతో ఈ ట్రైలర్ కొనసాగింది. సరదా సన్నివేశాలతో మొదలైన ట్రైలర్ .. ఎమోషన్ సీన్స్ తో పూర్తయింది. ముఖ్యమైన పాత్రల్లో బలమైన తారాగణమే ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో సమంతకి మరో హిట్ పడటం ఖాయమనేది ఆమె అభిమానుల మాట.