రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగశౌర్య
- ఒక హీరో .. ముగ్గురు హీరోయిన్లు
- ముగ్గురు దర్శకులతో మూడు కథల చిత్రీకరణ
- దర్శకత్వ పర్యవేక్షణలో రాఘవేంద్రరావు
ముగ్గురు దర్శకులపై రాఘవేంద్రరావు పర్యవేక్షణ ఉంటుంది. నాయికా ప్రాధాన్యత కలిగిన కథగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ముగ్గురు నాయికల జీవితాలు వేరు వేరు కథలుగా కొనసాగుతుంటాయి. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు చిత్రీకరించనున్నాడు. ఈ మూడు కథల్లోను నాయకుడిగా నాగశౌర్య కనిపించనున్నాడు. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.