సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మహేశ్ బాబు సరసన రష్మికకు ఛాన్స్
- సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- మెగా హీరో సినిమాలో మాళవిక శర్మ
* ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో 'తుగ్లక్' చిత్రంలో నటిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'శతమానం భవతి' ఫేం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
* మారుతి దర్శకత్వంలో సాయిధరం తేజ్ హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కథానాయికగా 'నేల టిక్కెట్టు' ఫేం మాళవిక శర్మను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.