Prudhvi Raj: ఆ భూములు కొంటే ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యేవాడిని: 'పెళ్లి' పృథ్వీరాజ్
- ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది
- స్థలాలు కొనడానికి ప్రయత్నించాను
- ఫ్లాట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న 'పెళ్లి' పృథ్వీరాజ్, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ''కెరియర్ తొలినాళ్లలో నేను చేసిన ఒక సినిమా వలన నా చేతికి ఒకేసారి పెద్ద అమౌంట్ వచ్చింది. ఆ డబ్బుతో శంషాబాద్ దగ్గర స్థలాలు కొనాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాను. ఓ 100 ఎకరాలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఒకతను నన్ను తీసుకుని వెళ్లాడు .. ఆ సమయంలో నాతో పాటు మా డ్రైవర్ కూడా వున్నాడు.
ఆ స్థలాలకి సంబంధించిన వ్యక్తి ఆ 100 ఎకరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వున్నది చూపించాడు. నేను తీసుకుందామనే ఫిక్స్ అయ్యాను. అయితే 100 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించడానికి, ప్రస్తుతం తాము పెడుతున్న పెట్టుబడికి మించి అవుతుందని మా డ్రైవర్ చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాను. ఆ డబ్బుతో హైదరాబాద్ లో ఓ అపార్ట్ మెంటులో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. అప్పట్లో ఆ 100 ఎకరాలు తీసుకుని ఉంటే .. ఈ రోజున కోటీశ్వరుడిని అయ్యేవాడిని" అని చెప్పుకొచ్చారు.