ఆశ్చర్యపరుస్తోన్న 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ బిజినెస్
- కిషోర్ తిరుమల నుంచి 'చిత్రలహరి'
- ముగింపు దశకి చేరుకున్న షూటింగ్
- ఏప్రిల్లో భారీస్థాయి విడుదల
ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా చేసిన 6 సినిమాలు పరాజయంపాలు కావడం వలన, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల లోపే జరగవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ హక్కుల ధర తెలియాల్సి వుంది. దర్శకుడిగా కిషోర్ తిరుమలపై గల నమ్మకంతో ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అయినా సాయిధరమ్ తేజ్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.